: అసోంలోని దిబ్రూగఢ్ లో బాంబు పేలుళ్లు
అసోంలోని దిబ్రూగఢ్ పట్టణంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. దిబ్రూగఢ్ పట్టణంలోని అమ్లపట్టి మార్కెట్ ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. కాగా ఈ పేలుళ్లలో ముగ్గురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుళ్లపై మరింత సమాచారం అందాల్సి ఉంది.