: లోక్ పాల్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అత్యంత కీలకమైన లోక్ పాల్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. బిల్లును పెద్దల సభ ఆమోదించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమైంది. బిల్లును వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉండగా, అన్ని పక్షాలు లోక్ పాల్ బిల్లును సమర్థించాయి. దీంతో లోక్ పాల్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లు లోక్ సభకు రేపు రానుంది.