: కాంగ్రెస్ లో అత్యధికులు స్వలింగ సంపర్కులే: రాందేవ్ బాబా
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తనదైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పై దాడికి దిగారు. తమ పార్టీలో అత్యధిక నేతలు స్వలింగ సంపర్కులు అయినందువల్లే... కాంగ్రెస్ పార్టీ సెక్షన్ 377పై అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఘాటైన విమర్శలు చేశారు. అందుకే స్వలింగ సంపర్కం నేరం అన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతోందని విమర్శించారు. అయితే, స్వలింగ సంపర్కంపై కాంగ్రెస్ సున్నిత అభిప్రాయంతో ఉందన్న రాందేవ్... అందుకే వారు స్వలింగ సంపర్కానికి మద్దతు తెలుపుతున్నారన్నారు.