: చైనాకు పోటీగా జపాన్


జపాన్, చైనాల మధ్య వివాదం ముదురుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సైనిక బలగాన్ని చూసుకుని దురాక్రమణలకు పాల్పడుతున్న చైనాకు జపాన్ సవాలు విసిరేందుకు సిద్ధమవుతోంది. ఇరు దేశాల మధ్య వైరాన్ని పెంచిన తూర్పు చైనా సముద్రంలో జపాన్ పరిధిలో ఉన్న సెన్కకు ద్వీపాలు తమ వాయు రక్షణ పరిధిలోకి వస్తాయని తాజాగా చైనా ప్రకటించింది.

చైనా చర్య జపాన్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో, జపాన్ పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. కొత్తగా మెరైన్ దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరో వైపు పలు అధునాతన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు... పెంచిన రక్షణ బడ్జెట్ ను ఆ దేశ కేబినెట్ ఆమోదించింది. దేశ ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News