: పుంజుకున్న పారిశ్రామిక ఉత్పత్తి
పారిశ్రామిక ఉత్పత్తి రంగం జనవరి నెలలో కాస్త పుంజుకుని 2.4 శాతంగా నమోదైంది. పరిశ్రమలు, గనులు తదితర విభాగాలలో ఈ వృద్ధి నమోదైంది. వాస్తవానికి ఇది 1.2శాతంగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేయగా, దానికి రెట్టింపు కావడం విశేషం.
పారిశ్రామిక ఉత్పత్తి రంగం వృద్ధి రేటు గత డిసెంబర్ నెలలో మైనస్ 0.6 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. దీనితో పోలిస్తే జనవరి నెల రేటు ఆశాజనకమైనదనే చెప్పవచ్చు. ఇక పారిశ్రామిక ఉత్పత్తిలో 76శాతం వాటా కలిగిన తయారీ విభాగం గతేడాది జనవరితో పోలిస్తే, ఈ జనవరిలో 2.7శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.