: ఈ నెల 20న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం: అశోక్ బాబు
ఈ నెల 20న అఖిపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు తెలిపారు. ఈ సమావేశానికి హాజరు కావాలని కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, లోక్ సత్తా, వామపక్షాలను కలిసి ఆహ్వానించామని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని కోరారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి అన్ని పార్టీలు రాజకీయాలను పక్కనబెట్టి, కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీలో బిల్లు చించడం, తోటి ఎమ్మెల్యేలపై దాడిచేయడం సరైన చర్య కాదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.