: ప్రస్తుత పరిణామాలపై ఢిల్లీ ప్రజలకు లేఖ రాస్తాం: కేజ్రీవాల్


ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై హస్తిన ప్రజలకు లేఖ రాస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాక ప్రజాభిప్రాయం సేకరిస్తామని, ఇందుకోసం 25వేల ప్రతులను సేకరిస్తామనీ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. అయితే, ఆప్ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందంటూ వచ్చిన వార్తలను ఖండించారు. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూడటంలేదని, తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామనీ అన్నారు. సమయం రాగానే ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News