: పోడియం వద్ద బైఠాయించిన జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి లోక్ సభలో స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. గతంలో ఓసారి లోక్ సభలో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్న జగన్... అప్పట్లో దుమారం రేగడంతో మౌనం వహించారు. తాజాగా ఈ రోజు లోక్ సభలో జై సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేస్తూ సీమాంధ్ర ప్రాంత నేతలతో కలసి జగన్ స్పీకర్ పోడియంను ముట్టడించారు.