: మేము అడ్డుకుంటాం.. కాంగ్రెస్ కు మూడింది: లగడపాటి


తాము రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, యూపీఏ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర సమైక్యత కోసం అనేక రకాలుగా వ్యూహాత్మకంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామన్నారు. కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.

కేంద్రంలో కొనసాగుతున్నది మైనార్టీ ప్రభుత్వం అని, ఆ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనే తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు. మా సంఖ్య పూర్తిగా ఉన్నప్పుడు యూపీఏ తప్పుడు చర్యలతో వాయిదాల పర్వం కొనసాగిస్తోందని అన్నారు. ఈ వారంలో అవిశ్వాసానికి మద్దతిస్తున్న వారి సంఖ్య సీమాంధ్ర మంత్రులతో కలిపి 49 మంది కాగా... వచ్చే సభలకంతా ఈ సంఖ్య మరింత పెరుగుతుందని లగడపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News