: ఆశ్రయమిస్తే అమెరికా గుట్టు విప్పుతా: బ్రెజిల్ కు స్నోడెన్ ఆఫర్
అమెరికా నిఘా వ్యవహారాల గుట్టును ప్రపంచానికి లీక్ చేసిన స్నోడెన్.. తనకు ఆశ్రయమివ్వాలని బ్రెజిల్ ను కోరాడు. ఈ మేరకు బ్రెజిల్ జాతీయ వార్తా పత్రిక ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. తనకు రాజకీయ ఆశ్రయం కల్పిస్తే.. బ్రెజిల్ లో అమెరికా సాగించిన గూఢచర్యం, నిఘా కార్యకలాపాలపై దర్యాప్తునకు కావాల్సిన సహకారం అందిస్తానని స్నోడెన్ ఆఫర్ చేశాడు. చట్టప్రకారం ఆశ్రయమిస్తేనే ఇది సాధ్యమని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది.