: టీ-బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలులో విద్యార్థుల వినూత్న నిరసన
తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలులో ఇవాళ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు రోడ్డు పైనే కూర్చుని పరీక్షలు రాశారు. సమైక్యాంధ్ర రాష్ట్రమే కావాలంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి శాసన సభ అబిప్రాయం కోరుతూ బిల్లును రాష్ట్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనూ.. సమైక్య రాష్ట్రమే కావాలంటూ కర్నూలు విద్యార్థులు నినదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.