: శాసనమండలి రేపటికి వాయిదా
శాసనమండలి రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశం అనంతరం ప్రారంభమైన సభలో తెలంగాణ, సమైక్యాంధ్ర ప్రాంతాల సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సమయంలో మండలి కొనసాగని పరిస్థితి ఏర్పడింది. దాంతో, శాసనమండలి ఉప ఛైర్మన్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.