: బలమైన లోక్ పాల్ ఆమోదం కోసం అందరూ ప్రయత్నించాలి: అరుణ్ జైట్లీ


రాజ్యసభలో ఈ రోజు లోక్ పాల్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ముందుగా సభలో ప్రసంగించిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ.. కీలకమైన లోక్ పాల్ ఆమోదం కోసం అందరూ ప్రయత్నించాలని కోరారు. అంతేగాక బలమైన లోక్ పాల్ కోసం భవిష్యత్తులో మరిన్ని సవరణలు అవసరమని సూచించారు. బిల్లు అమలైతే అన్ని రాష్ట్రాల్లో ఏడాదిలోగా లోకాయుక్త ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న జైట్లీ లోక్ పాల్ నియామకంలో అధికార దుర్వినియోగం జరగకూడదన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. అయితే, లోక్ పాల్ విషయంలో సెలెక్ట్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని, బిల్లు పరిధిపై పునరాలోచించాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News