: వ్యాట్ కు నిరసనగా రోడ్డెక్కిన వస్త్ర వ్యాపారులు


వస్త్రాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) విధించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు రోడ్డెక్కారు. సికింద్రాబాదులోని టొబాకొ బజారు నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వందలాది మంది వస్త్ర వ్యాపారులు ఈ ర్యాలీలో పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా వ్యాట్ లేకపోయినా ఇక్కడే ఎందుకు విధించారంటూ ప్రశ్నించారు. తీవ్ర నష్టాల్లో కొట్టు మిట్టాడుతున్న తమపై ఇలా వడ్డింపులు వేయడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News