: మంచు దుప్పటి కప్పుకున్న గిరిజన గ్రామాలు
విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. సోమవారం కూడా గిరిజన గ్రామాలు పొగమంచు దుప్పటిని కప్పుకున్నాయి. గిరిజనులు చలిగాలులతో వణికిపోతూ.. రాత్రి పగలూ తేడా లేకుండా చలిమంటలు వేసుకుని కాలం గడుపుతున్నారు. లంబసింగిలో రెండు, చింతపల్లిలో ఐదు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా చలిగాలులు వీస్తున్నాయి. దాంతో రాత్రి వేళల్లో సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాదులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.