: తిరుపతి లడ్డూలో నట్టు.. భక్తునికి ఇక్కట్లు


తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు రావడంతో భక్తులు ఒకింత విస్మయానికి గురయ్యారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రామచంద్ర శనివారం స్వామి దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తరువాత ఆయన ప్రసాదాన్ని నోట్లో వేసుకోగానే ఓ నట్టు ముక్క పంటికి తగిలింది. తిరుమల లడ్డూను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి స్వీకరిస్తారని, ఇలాంటి ఘటన జరగడం ఆవేదన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇకనైనా తిరుమల ఆలయ అధికారులు లడ్డూ తయారీలో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిందిగా భక్తులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News