: చోరీ కేసులో పాటల రచయిత కులశేఖర్ కు జైలు శిక్ష


ప్రముఖ సినీ పాటల రచయిత కులశేఖర్ కు కాకినాడ ఐదో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆరు నెలల జైలు శిక్ష విధించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని త్రిపురసుందరి ఆలయం ఆంజనేయస్వామి విగ్రహానికి ఉన్న 350 గ్రాముల వెండి కిరీటాన్ని కులశేఖర్ దొంగిలించారని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో దోషిగా రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారని చెప్పారు.

సినిమాల్లో పాటలు రాస్తూ తక్కువ కాలంలోనే బాగా పేరు సంపాదించుకున్న కులశేఖర్ ఐదేళ్ల క్రితం మెదడుకి సంబంధించిన వ్యాధితో బాధపడ్డారు. దాంతో, కొన్ని రోజులు కోమాలోకి కూడా వెళ్లారన్నారు. కొంతకాలం ఎవరినీ గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నారని కూడా చెప్పుకున్నారు. అనంతరం వైద్యుల ట్రీట్ మెంట్ తో కొద్దిగా కోలుకున్నారు.

  • Loading...

More Telugu News