: కుప్పకూలిన ఇంగ్లండ్.. యాషెస్ ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా


ఆస్ట్రేలియా ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. పెర్త్ లో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను మట్టికరిపించి యాషెస్ సీరీస్ ను కైవసం చేసుకుంది. చివరి సారిగా కంగారూలు 2006-07లో యాషెన్ ను గెలుచుకున్నారు. ఈ విజయంతో ఐదు టెస్టుల ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 385, రెండో ఇన్నింగ్స్ లో 369 (డిక్లేర్) పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 251 రన్స్ చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 504 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కుక్ సేన 353 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ స్టోక్స్ సెంచరీ (120) చేసినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఆసీస్ బౌలర్ బిచెల్ జాన్సన్ మరో సారి చెలరేగి 4 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో 111 పరుగులు చేసి... ఆస్ట్రేలియాను పటిష్ఠ స్థితిలో నిలబెట్టిన స్టీవెన్ స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

  • Loading...

More Telugu News