: ఈ మెయిల్ తో రూ. 63లక్షలకు టోపీ


ముంబైలో అదొక జాతీయ బ్యాంకు శాఖ. ఎన్ఆర్ఈ రూపీ ఖాతా కలిగిన కస్టమర్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. 'నా ఆరోగ్యం బాలేదు. లండన్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను. నాకు డబ్బులు అవసరం. నేను వ్యక్తిగతంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. కనుక నా ఖాతాలోని సొమ్మును ఇక్కడి ఖాతాకు బదిలీ చేయగలరు' అని అందులో ఉంది. ఆ మెయిల్ ఐడీ తమ ఎన్ఆర్ఈ ఖాతాదారుడు చందర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీయే కావడంతో బ్యాంకు మరో ఆలోచన లేకుండా 63 లక్షల రూపాయలను లండన్ లోని చందర్ పేరుతో గల మరో ఖాతాకు బదిలీ చేసింది.

ముంబైలో వ్యాపారి చందర్ ఒక రోజు బ్యాంకుకు వెళ్లాడు. చూస్తే రెండు లావాదేవీల్లో 63లక్షలు బదిలీ అయ్యాయని తెలిసింది. అదేమని అడిగితే 'మీరు మావద్ద నమోదు చేసుకున్న మెయిల్ ఐడీ నుంచే మాకు అభ్యర్థన వచ్చింది. అందుకే బదిలీ చేశాం' అని బదులిచ్చారు. సైబర్ నేరగాడెవరో చందర్ మెయిల్ ఐడీ పాస్ వర్డ్ కొట్టేసి తెలివిగా బ్యాంకుకు మెయిల్ పంపి వారితోనే నిధులు బదిలీ చేయించుకుని టోపీ పెట్టడం నిజంగా వండరే. బ్యాంకు అధికారులు కనీసం మరో విధంగా ధ్రువీకరించుకోకుండా గుడ్డిగా బదిలీ చేయడం కూడా వండరే!

  • Loading...

More Telugu News