: పదేళ్ర క్రితమే లోక్ పాల్ వచ్చుంటే.. ఇన్ని దోపిడీలు జరిగేవి కాదు: టీడీపీ ఎంపీ నామా
కాంగ్రెస్ హయాంలో కేంద్రం, రాష్ట్రాల్లో భారీ అవినీతి, దోపిడీ జరిగిందని టీడీపీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అంతులేని అవినీతిని అరికట్టడానికి లోక్ పాల్ బిల్లు రావాల్సిన అవసరం ఉందని... బిల్లు పాస్ కావడానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుందని తెలిపారు. ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. పదేళ్ల క్రితమే లోక్ పాల్ బిల్లు వచ్చి ఉంటే దేశంలో, రాష్ట్రంలో ఈ దోపిడీలు జరిగేవి కావని చెప్పారు. విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత యూపీఏకు ఉందని అన్నారు.