: సీమాంధ్రలో విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి ఐకాస పిలుపు
రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో విద్యాసంస్థల బంద్ కు సీమాంధ్ర విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. ఈ రోజు, రేపు సీమాంధ్రలో విద్యాసంస్థలు బంద్ పాటించాలని ఐకాస కోరింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర విభజన ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని ఐకాస ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళితే సీమాంధ్రలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస హెచ్చరించింది.