: రెండు జబ్బులకు ఒకే మందు
రెండు రకాల జబ్బులకు ఒకే మందును ఉపయోగించవచ్చట. హైబీపీని అదుపులో ఉంచడానికి ఎక్కువగా స్పైరానోలాక్టోస్ మందుబిళ్లను వాడుతుంటారు. దీనివల్ల హైబీపీ అదుపులోకి వస్తుంది. అదే మందుబిళ్ల కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుందని ప్రత్యేక అధ్యయనంలో తేలింది. కీళ్లలో మంటకు, నొప్పికి కారణమయ్యే ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్‌ను ఈ మందు నిర్వీర్యం చేస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. ఇకపై హైబీపీ ఉన్నవారు ఒకే మందుబిళ్లతో ఇటు హైబీపీని, అటు కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చుమరి!