: కాలిమీద చెయ్యి మొలిచింది!


కాలిమీద చెయ్యి ఎలా మొలిచింది అనుకుంటున్నారా... మొలవడం కాదుగానీ కాలికి వైద్యులు చెయ్యిని అతికించారు. తర్వాత దాన్ని తిరిగి దాని యధాస్థానంలో అమర్చనున్నారు. చైనాలో నివసించే జియావో వెయ్‌ విధినిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తూ అతని చేయి ముంజేయి వరకూ తెగి కిందపడిపోయింది.

ఈ ప్రమాదాన్ని గమనించిన అతని సహోద్యోగులు వెంటనే జియావోను స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మరింత పెద్ద అసుపత్రికి పంపించారు. అక్కడి వైద్యులు తెగిన చేయిని తిరిగి అతికించడానికి కొంత సమయం పడుతుందని, అంతవరకూ తెగిన చేయి కుళ్లిపోకుండా ఉండడానికి ఆ చేయి ముక్కను కాపాడేందుకు కాలికి దాన్ని అతికించారు. కాలి మడమ సమీపాన చేతిని అతికించి, దానికి రక్తప్రసారం అయ్యేలా చేశారు. దీంతో కాలికి చేయి మొలిచినట్టు అయ్యింది. త్వరలోనే ఆ చేతిని అక్కడినుండి తీసి యధాస్థానంలో అమరుస్తామని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News