: దుర్మార్గం, అనాగరికం, బాధాకరం.. దేశ చరిత్రలో ఇలా జరగలేదు: చంద్రబాబు


తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన తీరు అత్యంత దారుణంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఆవరణలో నేడు చోటు చేసుకున్న సంఘటనలు దుర్మార్గమని.. అనాగరికంగా ఉన్నాయని.. అత్యంత బాధాకరమని అన్నారు. దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన చర్య మరోటి లేదని అన్నారు. జరుగుతున్న దారుణాలకు స్పీకరే కారణమని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి శాంతిభద్రతలు మాత్రమే గవర్నర్ చేతిలో ఎలా పెడతారని ప్రశ్నించారు.

గవర్నర్ కుండే అధికారాలు ఏంటో వీరికి తెలుసా? అని ప్రశ్నించారు. ఒక ప్రాంతానికి న్యాయం చేస్తున్నామని చెప్పి, మరో ప్రాంతానికి ఎలా అన్యాయం చేస్తారని నిలదీశారు. ఈ బిల్లు ప్రకారం సీమాంధ్రులకు ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఒక్క మాట కూడా లేదన్నారు. రెవెన్యూ అంశాలపై చర్చే లేదన్నారు.

ఈ విధానం ఎవరికీ మంచిది కాదని అన్నారు. మీ ఇష్టానుసారం రాసిపెట్టడానికి ఇదేమన్నా మీ జాగీరా? అని మండిపడ్డారు. తాము మొదటి నుంచి రెండు ప్రాంతాల జేఏసీలతో మాట్లాడండి. ప్రజలతో చర్చించండి.. ప్రజా సమస్యలు వినండి అని చెబుతుంటే ఏదీ వినకుండా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News