: పాకిస్థాన్ షియా పార్టీ నేత కాల్చివేత


పాకిస్థాన్ లో షియా పార్టీ తెహ్రిక్ ఇ నిఫాజ్ ఫికా జఫరియా(టీఎన్ఎఫ్ జే) నేత అల్లామా నసిర్ అబ్బాస్ ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కాల్చి చంపారు. ఓ సమావేశంలో పాల్గొన్న నసిర్ అబ్బాస్ ఇంటికి వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ అబ్బాస్ ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. దీంతో అతని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న అబ్బాస్ మద్దతుదారులు పెద్దఎత్తున ఆసుపత్రికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

  • Loading...

More Telugu News