: పట్టుబడిన ఎర్రచందనం దొంగలకు ఉపాధి కల్పించాలి: టీటీడీ ఛైర్మన్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ తిరుపతి శేషాచలం అడవుల్లో పోలీసులకు పట్టుబడ్డ దొంగలకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఉపాధి అవకాశాలు కల్పించాలని టీటీడీ ఛైర్మన్ బాపిరాజు ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది సూత్రదారుల చేతుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు పావులుగా మారారని పేర్కొన్నారు. కాగా, దొంగల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది కుటుంబాలకు టీటీడీ సహాయం అందిస్తుందని చెప్పారు. కిందిస్థాయి అటవీ అధికారులకు సరైన ఆయుధాలు కల్పించాలని కోరిన బాపిరాజు, అరుదైన ఎర్రచందనం మొక్కలను ఐదు కోట్ల వ్యయంతో 30 ఎకరాల్లో పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు.