: హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో తగులబడిన కారు
హైదరాబాదు మహానగర ఔటర్ రింగ్ రోడ్డులో ఇవాళ ఓ కారు దగ్ధమైంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలికి వెళ్లే ఔటర్ దారిలో ప్రయాణిస్తున్న కారులోంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. యజమాని అప్రమత్తమై కారు నుంచి కిందకు దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలకు కారు తగులబడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డులోని అదే ప్రాంతంలో నిన్న జరిగిన కారు-బైక్ ప్రమాద ఘటనలో దంపతులు మరణించడం యాదృచ్ఛికం.