: కొత్త పోప్ ఎన్నిక ఆరంభం
కొత్త పోప్ ఎన్నిక నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 115 మంది కార్డినళ్లు ఇందుకోసం వాటికన్ సిటీకి చేరుకున్నారు. కాసా శాంటా మార్టాలో రహస్య ఓటింగ్ విధానం ద్వారా పోప్ ను ఎన్నుకుంటారు. ఈ కార్డినళ్లలో మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చే వరకూ ఎన్నిక కొనసాగుతుంది. రెండొంతుల మెజారిటీ వచ్చిన వెంటనే కొత్త పోప్ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు.