: ట్రావెన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ మృతి
కేరళలోని ట్రావెన్ కోర్ మహారాజు ఉత్రాదమ్ తిరునల్ మార్తాండ వర్మ(91) మృతి చెందారు. వయసు సంబంధిత అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారు జామున 2.20 గంటలకు ఆయన చనిపోయారు. ఈ సాయంకాలం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ట్రావెన్ కోర్ చివరి రాజు చిత్తిర తిరునాళ్ బలరామ వర్మ మరణం అనంతరం 1991 నుంచి రాజ కుటుంబానికి పెద్దగా మార్తాండ వర్మ ఉన్నారు. అంతేగాక శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి ప్రధాన ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు.