: జస్టిస్ గంగూలీకి పదవీ గండం
న్యాయ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా, లైంగిక వేధింపులకు పాల్పడిన పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గంగూలీకి పదవీ గండం వచ్చి పడింది. న్యాయ విద్యార్థిని తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఆయన పదవి నుంచి తప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. జస్టిస్ గంగూలీ తన పదవి నుంచి తప్పుకోకుంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ హెచ్చరించారు. అలాగే సుప్రీంకోర్టు కూడా గంగూలీపై చర్యలు తీసుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గంగూలీ రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. జస్టిస్ గంగూలీ తన పదవి నుంచి తప్పుకోవాలని ఇప్పటికే బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాను రాజీనామా చేసేది లేదని గంగూలీ చెబుతూ వస్తున్నారు. మరి కేంద్ర మంత్రి హెచ్చరికల నేపథ్యంలో ఆయన దిగొస్తారేమో చూడాలి!