: హోటల్ గదిలో జస్టిస్ గంగూలీ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు: లా విద్యార్థిని


జస్టిస్ గంగూలీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి మరిన్ని వివరాలు బయటపెట్టింది. 2012లో జస్టిస్ గంగూలీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు లా విద్యార్థిని ఇంటర్న్ షిప్ చేసింది. ఆ సమయంలో తానెదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించింది. ఆమె మాటల్లోనే..

ఢిల్లీలోని ఒక హోటల్ లో తన గదినే షేర్ చేసుకోవాలని జస్టిస్ గంగూలీ కోరారు. నా కోసం మరొక గదిని సమకూర్చడం సాధ్యం కాదని చెప్పారు. నేను వ్యతిరేకించా. గంగూలీ నా దగ్గరగా వచ్చారు. నా వెనుక చేయి వేశారు. శారీరక సంబంధం సరికాదని, ఈ ప్రవర్తన జడ్జిగా మీకు తగదని చెప్పా. అయినా జడ్జి నాపై వేసిన చేయి తీయనేలేదు. మరింత దగ్గరగా వచ్చి నా తలపై చేయి వేసి 'నువ్వు చాలా అందంగా ఉన్నా'వన్నారు. వెంటనే నా కుర్చీలోంచి లేవబోయాను. నా చేయి పట్టుకున్నారు. నేను నీకు ఆకర్షితుడినయ్యానని అర్థమయ్యే ఉంటుంది. తాగి మాట్లాడుతున్నానని అనుకోకు. నిజంగా నువ్వంటే ఇష్టం, ఐ లవ్ యూ అన్నారు. వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. నా చేయిపై ముద్దు పెట్టుకున్నారు అంటూ లా విద్యార్థిని జస్టిస్ గంగూలీ హోటల్లో తనపట్ల ప్రవర్తించిన తీరును వివరించింది.

  • Loading...

More Telugu News