: సమాజ్ వాదీ పార్టీలో చేరిన ధోనీ సోదరుడు
టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ పెద్ద సోదరుడు నరేంద్ర సింగ్ ధోనీ సమాజ్ వాదీ పార్టీలో చేరాడు. ఈ మేరకు నిన్న (ఆదివారం) లక్నోలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ను ఆయన నివాసంలో కలిసి, పార్టీలో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ లో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని నరేంద్ర సింగ్ చెప్పినట్లు సమాచారం. 2009 నుంచి మొన్నటివరకు ఆయన బీజేపీలో ఉన్నారు.