: ఎమ్మెల్యేను రక్షించిన గన్ మన్
దైవదర్శనానికి వెళ్లి మునిగిపోతున్న ఎమ్మెల్యేను భద్రతా సిబ్బంది రక్షించిన ఘటన వేదాద్రిలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీయోగానంద లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కుటుంబసమేతంగా వెళ్లారు. కృష్ణా నదిలో ఉన్న సాలగ్రహ నరసింహస్వామి (నామాలు) వద్దకు ఈతకొట్టుకుంటూ వెళ్లారు. స్వామివారి నామాలు దర్శించుకుని తిరిగి ఈతకొడుతూ వస్తుండగా ఎమ్మెల్యే అలసటతో నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉండి పరిసరాలను గమనిస్తున్న ఆయన గన్ మన్ అప్రమత్తమై వెంటనే నదిలో దూకి ఎమ్మెల్యేను రక్షించాడు.