: బిల్లు ప్రతులను చించడంపై మండిపడ్డ ఈటెల


తెలంగాణ బిల్లు ముసాయిదా ప్రతిని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చించివేయడంపై టీఆర్ఎస్ శాసనసభా పక్షం నేత ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించే చర్యగా అభివర్ణించారు. జగన్ బాబు, చంద్రబాబు, కిరణ్ బాబు తెలంగాణపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. విడిపోయి కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటుంటే ఇలా బిల్లు ప్రతులను చించివేయడం అవమానించడమేనన్నారు. ఇలాంటి పిచ్చివేషాలు మానుకోకుంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News