: టీ బిల్లు ప్రవేశపెట్టిన స్పీకర్ కు కృతజ్ఞతలు: ఎర్రబెల్లి
పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన సభాపతికి, అసెంబ్లీ కార్యదర్శికి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లుపై అభిప్రాయాలు సేకరించి రాష్ట్రపతికి పంపాలని, బిల్లుపై ఓటింగ్ అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి అడ్డుకోవడం వల్లే మూడు రోజులు బిల్లు ఆగిందని ఆరోపించారు. ఎందరో విద్యార్ధుల త్యాగ ఫలితమే తెలంగాణ అన్న ఎర్రబెల్లి.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.