: సభ ఆర్డర్ లో లేనప్పుడు బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?: పయ్యావుల
శాసనసభ ఒక ఆర్డర్ లో లేకుండా, తీవ్ర గందరగోళంలో ఉన్న సమయంలో తెలంగాణ బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టడంతో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆగమేఘాలపై బిల్లును సభలో పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బీఏసీ సమావేశం జరగకుండా, సభ్యుల అంగీకారం లేకుండా ఎందుకు ప్రవేశపెట్టారని అడిగారు.