: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన స్పీకర్
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (తెలంగాణ)బిల్లును టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీవ్ర ఆందోళన మధ్యనే శాసనసభలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టారు. సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తుండగానే బిల్లులోని అంశాలను అసెంబ్లీ కార్యదర్శి సదారాం సభలో చదవి వినిపించారు. అనంతరం ముసాయిదా బిల్లు ఆంగ్లంలో ఉన్నందున సభ్యుల సౌకర్యార్ధం తెలుగు, ఉర్ధూ భాషల్లో స్వేచ్ఛానువాదం చేసిన ప్రతులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అటు బిల్లును శాసనసభ వెబ్ సైట్ లోనూ ఉంచినట్లు స్పీకర్ తెలిపారు. సభ్యుల ఆందోళనలతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.