: భూకంపాలకు మనమే కారణమట!


కొన్ని ప్రకృతి వైపరీత్యాలకు మనం చేసే తప్పిదాలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన భారీ భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో కొన్ని మాత్రమే సహజంగా సంభవించినా కొన్ని మాత్రం కేవలం మానవ తప్పిదాల వల్లే సంభవించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనం మన అవసరాలకోసం భూగర్భం లోతులను పరిశోధిస్తున్నాము. అలాగే రిజర్వాయర్లు, ఇతరాలైన వాటికోసం భూమిని తవ్వేస్తున్నాం. ఇలాంటి చర్యలే భూకంపాలకు కారణమవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సంభవించిన కొన్ని భారీ భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు కావని, మానవ చర్యలే వాటికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఇటీవల సంభవించిన అనేక భూకంపాలను లోతుగా అధ్యయనం చేసిన భూభౌతిక శాస్త్ర నిపుణుడైన క్రిస్టియన్‌ క్లోసే ఈ విషయాన్ని తేల్చారు. రిజర్వాయర్ల నిర్మాణాలు, చమురు, సహజవాయువు నిక్షేపాల వెలికితీత వంటి పనులన్నీ కలిసి భూకంపాలకు కారణం కావచ్చని క్లోసే అభిప్రాయపడ్డారు. ఇటీవల సంభవించిన భూకంపాల్లో 92 భారీ భూకంపాలకు కేవలం మనుషుల చర్యలే కారణమని క్లోసే తెలిపారు.

  • Loading...

More Telugu News