: ఇండియన్ ఐడల్ విజేత సందీప్ ఆచార్య మృతి
ఇండియన్ ఐడల్ సీజన్-2 విజేత సందీప్ ఆచార్య (29) ఈ రోజు ఉదయం మృతి చెందాడు. తీవ్రమైన పచ్చ కామెర్లతో బాధపడిన ఆయన గుర్ గావ్ లోని మేదాంత మెడిసిటీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక నెల వయసున్న కుమార్తె ఉన్నారు. సందీస్ మృతికి గాయకులు శ్రేయా ఘోషల్, సోనూ నిగమ్ తదితరులు సంతాపం తెలిపారు.