: సీఎం తన వైఖరి స్పష్టం చేయాలి: నాగం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ముసాయిదాపై చర్చించడం ఇష్టం లేనట్టుందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు. బిల్లును ఆలస్యం చేయాలని ఆయన ఎందుకనుకుంటున్నారో స్పష్టం చేయాలని అన్నారు. తెలంగాణ బిల్లుపై రేపట్నుంచే అసెంబ్లీలో చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి... అందరం అభివృద్ధి చెందేలా ప్రయత్నించడానికి సీమాంధ్ర నేతలకున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News