: విజయవాడలో 100 ఎకరాల్లో హెల్త్ సిటీ: మంత్రి కొండ్రు
విజయవాడలో వంద ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ సిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రి కొండ్రు మురళి తెలిపారు. అంతే కాకుండా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలను తెలియజేశారు.