: ఇక నిండు నూరేళ్లూ కాదు... నిండు నూట యాభై ఏళ్లు!


మానవుడు వార్ధక్యాన్ని జయించి, నూట ఏభై ఏళ్ల వరకు జీవించగలిగే రోజులు త్వరలోనే రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 150 ఏళ్ల వరకు మనిషి ఆయుర్దాయాన్ని పెంచే మందులు మరో ఐదేళ్లలో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది. మన శరీరంలో వార్ధక్యాన్ని నెమ్మదింప జేసే ఒక ఎంజైమ్ ను లక్ష్యంగా చేసుకోవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇది వార్ధక్యం వల్ల వచ్చే వ్యాధులను నిరోధించడంతో బాటు, తద్వారా మన ఆయుష్షును కూడా పెంచుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ ఎంజైమ్ పేరు 'ఎన్ఐఆర్టీ 1'. ఈ ఎంజైమ్ మీద పనిచేసే మందుల ఆవిష్కరణకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికి 117 ఔషధాలను ప్రయోగించారు. ఇవన్నీ కూడా ఈ ఎంజైమ్ మీద బాగా పనిచేశాయి. మరో ఐదేళ్ళలో మరిన్ని మందుల ఆవిష్కరణ జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ మందుల వల్ల కేన్సర్, మధుమేహం, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా మటుమాయం అవుతాయట!               

  • Loading...

More Telugu News