: ఆరో రోజుకు చేరిన అన్నా ఆమరణ దీక్ష


అవినీతిని తుడిచిపారేయడానికి వీలు కల్పించే జన్ లోక్ పాల్ బిల్లును తీసుకురావాలనే డిమాండ్ తో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేప్టటిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో ఆరో రోజుకు చేరింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధిలో అన్నా దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాగైనా రేపు రాజ్యసభలో లోక్ పాల్ బిల్లుకు ఆమోదముద్ర వేయించాలనే వ్యూహంలో ఉంది.

వాస్తవానికి అన్నా కోరినట్లుగా పూర్తి కఠిన నిబంధనలతో జన్ లోక్ పాల్ బిల్లును కేంద్రం తీసుకురాలేదు. అన్నా డిమాండల్లో సగం మేరకు నేరవేరుస్తూ బిల్లును రూపొందించి లోక్ సభలో పెట్టగా దానికి సభామోదం ఎప్పుడో లభించింది. కానీ, రాజ్యసభలో యూపీఏకు తగిన బలం లేకపోవడం, ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అన్నా మరోసారి దీక్షకు దిగారు. దీంతో ఎలాగైనా ప్రస్తుత సమావేశాల్లోనే లోక్ పాల్ కు ఆమోదం లభించేట్లు చూడాలని.. తద్వారా అన్నా దీక్షను విరమింపజేయాలని కేంద్రం భావిస్తోంది.

  • Loading...

More Telugu News