: రైలు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి టికెట్లపై సర్ చార్జ్?


కాపలాలేని రైలు, రహదారులు కలిసే మార్గాల (రైల్వే లెవల్ క్రాసింగులు) వద్ద ఓవర్ బ్రిడ్జిలు, లేదా అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని రైల్వే శాఖ భావిస్తోంది. కాపలా లేకపోవడంతో వాహనాలు, రైళ్లు ఢీకొన్న సమయాల్లో ఎంతో ప్రాణనష్టం జరుగుతోంది. ఇలా గత మూడేళ్లలో 194 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే శాఖ పరిధిలో మొత్తం 31,254 లెవల్ క్రాసింగులు ఉండగా 10,797చోట్ల గేట్ మెన్లు లేరు.

ఇలాంటి చోట్ల బ్రిడ్జిల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఇందుకోసం ప్రయాణికుల టికెట్లపై సర్ చార్జీ విధించి నిధులు రాబట్టుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. లేదా ప్రభుత్వం ఆ మేరకు నిధులు సమకూర్చాలని కోరుతోంది. ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో కాపలాలేని రైల్వే లెవల్ క్రాసింగుల వద్ద బ్రిడ్జిలు నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు.

  • Loading...

More Telugu News