: అది సమైక్య పరుగు కాదు విభజన పరుగు: హరికృష్ణ
బీజేపీ చేపట్టిన 'రన్ ఫర్ యూనిటీ'పై టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీది సమైక్య పరుగు కాదని, అది విభజన పరుగని అన్నారు. దేశమంతా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న బీజేపీ, మన రాష్ట్రంలో మాత్రం విభజనను కోరుకుంటోందని విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను బీజేపీ గౌరవించాలని సూచించారు. రాష్ట్ర విభజనపై బీజేపీ వైఖరిని ఆయన తప్పుబట్టారు.