: బెంగళూరు దక్షిణ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నీలేకని
ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ గా ఉన్న నందన్ నీలేకని బెంగళూరు దక్షిణ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగడం దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. నిన్న జరిగిన కర్ణాటక కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ బెంగళూరు దక్షిణ లోక్ సభ స్థానానికి నీలేకని పేరును ఎంపిక చేసింది. రాష్ట్రంలోని 28 లోక్ సభ స్థానాలకు పరిశీలనలో ఉన్న అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను రూపొందించారు. వచ్చే నెలలో తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ముందుగా పేర్లను ప్రకటిస్తే.. అభ్యర్థులు తమ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టగలరని భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన జాబితాకు అధిష్ఠానం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.