: అద్భుతాలను నమ్మలేని వారికి నా జీవితమే ఓ నిదర్శనం: రజనీకాంత్
ఒక సాధారణ బస్ కండక్టర్ ఇంత మంది గొప్ప వ్యక్తులతో వేదిక పంచుకోవడం ఒక అద్భుతమని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని చాలా మంది నమ్మరని... జీవితంలో అద్భుతాలు జరుగుతాయనడానికి తానే ఓ నిదర్శనమని తెలిపారు. భగవంతుడు ఆదేశించిందే తాను చేశానని అన్నారు. నిన్న సాయంత్రం ఎన్డీటీవీ నిర్వహించిన '25 గ్లోబల్ ఇండియన్ లెజెండ్స్' సన్మాన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రజనీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రజనీ పై విధంగా స్పందించారు. ఈ అవార్డును తన గురువు బాలచందర్, సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్ తో పాటు తమిళ ప్రజలకు ఆయన అంకితం చేశారు.