: వడోదరలో 'సమైక్యతా పరుగు'ను ప్రారంభించిన మోడీ
భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ గుజరాత్ లోని వడోదరలో సమైక్యతా పరుగును ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరిస్తూ ఈ సమైక్యతా పరుగును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశ నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేసిన ఘనత పటేల్ దేనని కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యతని, మన బలం కూడా అదేనని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ పటేల్ విగ్రహ ఏర్పాటులో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం సమైక్యతా పరుగును నిర్వహించారు.