: నెలల పిల్లల్లో కూడా గుర్తించవచ్చు
చిన్న వయసులో ఆటిజంను గుర్తించగలిగే విధంగా ఒక సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పద్ధతి ద్వారా పన్నెండు నెలల వయసున్న చిన్నారుల్లో సైతం ఆటిజం సమస్యను కచ్చితంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ జోసెఫీన్ బర్‌బారో ఈ సరికొత్త పద్ధతిని గురించి మాట్లాడుతూ, రెడ్‌ఫ్లాగ్ మార్కర్ల సెట్ ద్వారా నెలల వయసున్న పిల్లల్లో సైతం ఆటిజం లక్షణాలను గుర్తించవచ్చని తెలిపారు. నెలల వయసున్న పిల్లలు చూపు సరిగా నిలపలేకపోవడం, నవ్వలేకపోవడం, వారి బొమ్మలను ఇతరులకు చూపి ఆడుకోలేకపోవడం, తమ పేరుపెట్టి పిలిచినాసరే గుర్తించి స్పందించలేకపోవడం వంటి సమస్యలను ఈ రెడ్‌ఫ్లాగ్ మార్కర్ల ద్వారా గుర్తించవచ్చని జోసెఫీన్ బర్‌బారో చెబుతున్నారు.