: అండర్ 19 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో భారత్ ప్రత్యర్థి పాకిస్థాన్


ఫిబ్రవరి 14న దుబాయ్ లో ప్రారంభం కానున్న అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్ తొలి మ్యాచ్ ను పాకిస్థాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో జరుగనుంది. అండర్ 19 వరల్డ్ కప్ యూఏఈ లోని ఏడు వేదికల్లో జరుగనుండగా, టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. భారత్ ఇప్పటివరకు 2000లో మహ్మద్ కైఫ్ నేతృత్వంలో, 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో ప్రపంచకప్ లు సాధించింది.

  • Loading...

More Telugu News